ఒక‌వేళ బెయిల్ ఇస్తే.. కేజ్రీకి కండీష‌న్ పెట్టిన సుప్రీంకోర్టు

ఒక‌వేళ బెయిల్ ఇస్తే.. కేజ్రీకి కండీష‌న్ పెట్టిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ అభ్యర్థనపై మంగళ వారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈడీ కూడా తన వాదనలను వినిపించింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మధ్యంతర బెయిల్ను మంజూరీ చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసుతో లింకున్న ఫైల్స్ను కేజ్రీ చూడరాదు అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్ మంజూరీ చేస్తే, అప్పుడు అధికారిక డ్యూటీలను కేజ్రీవాల్ నిర్వర్తించరాదు అని కోర్టు చెప్పింది. ఫైల్స్ మీద సంతకం చేయరాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం కేజ్రీ బెయిల్ గురించి సుప్రీం ఏదైనా తీర్పును ఇచ్చే అవకాశం ఉన్నది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos