కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ల ఉపసంహరణ

కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ల ఉపసంహరణ

న్యూఢిల్లీ : డిమాండ్ పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెన్కా ప్రకటించింది. ఐరోపాలో వ్యాక్సేజెవ్రియా వాక్సిన్ మార్కెటింగ్ అధికారాలను కూడా ఉపసంహరించుకోనున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది.బహుళ వేరియంట్లతో కొవిడ్ 19 వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంతో, అందుబాటులో ఉన్న నవీకరించిన వ్యాక్సిన్లలో మిగులు ఉందని కంపెనీ పేర్కొంది. ఇది వాక్స్జెవ్రియాకు డిమాండ్ తగ్గడానికి కూడా దారితీసిందని, ఇకపై వ్యాక్సిన్ తయారు చేయడం, సరఫరా చేయడం జరగదని తెలిపింది.వ్యాక్సిన్ ఉపసంహరణకు సంబంధించి మార్చి 5న ఆస్ట్రాజెన్కా దరఖాస్తు చేసిందని, మే 7 నుండి అమలులోకి వచ్చిందని టెలిగ్రాఫ్ పేర్కొంది.అయితే ఈ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్ వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఆస్ట్రాజెన్కా ఇటీవల లండన్ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos