తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • ‘ మాధ్యమాల’కు కేసీఆర్ శాపం

    హైదరాబాదు: ‘కరోనా భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు దుర్మార్గులు సామాజిక మాధ్యమాల్లో చౌకబారు ప్రచారంతో ప్రజల్ని మానసికంగా హింసిస్తున్నారు. దీనికి తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించి తీరుతార’ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఇక్కడ మండి పడ్డారు. ‘మేము గొప్పవాళ్లం, మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరన్న గర్వంతో కొందరు మూర్ఖులు పెట్రేగిపోతున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రపంచం, దేశం ఆగం అవుతున్న సమయంలో వారి చిల్లర ప్రచారాలు న్యాయమేనా .తమనెవరూ ఏమీ చేయలేరేమనుకుంటున్నారుగాని, వారు అంతకు అంత

    READ MORE
  • కల్లు,మద్యం లేక వింత ప్రవర్తనలు,ఆత్మహత్యలు..

    లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న తెలంగాణ సర్కారుకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. నిత్యమూ కల్లు, మందుకు అలవాటు పడిన వారు, ఇప్పుడు అవి దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఇందూరులో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా, నిజామాబాద్‌ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవ్యక్తి ఫిట్స్‌ వచ్చి మరణించాడు.నగరంలోని సాయినగర్‌కు చెందిన శకుంతల (65)కు నిత్యమూ కల్లు తాగడం అలవాటు. గత వారం రోజులుగా కల్లు అందుబాటులో లేకపోగా, రెండు రోజుల

    READ MORE
  • గరిటె తిప్పిన రేవంత్‌ రెడ్డి..

    కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న వేళ, నిత్యమూ రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులకు కాస్తంత ఆటవిడుపు లభించింది. వారు ఇంటిపట్టునే ఉండి సేదదీరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, లాక్‌ డౌన్ రోజులను సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆయన కుక్‌ గా మారిపోయారు. అందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వంటింట్లోకి దూరి గరిట తిప్పి, స్వయంగా వండి, ఆయన భార్య గీతకు వంటకాలను రుచి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు