తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • పోలీస్ కమిషనర్‌కు తెలంగాణ వైన్స్ అసోసియేషన్ లేఖ..

    కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వైన్స్ దుకాణాలు మూసివేత కారణంగా, గత కొన్ని రోజుల నుంచి మద్యం లభించకపోవడంతో దొంగలు మద్యం షాపులను ధ్వంసం చేస్తున్నారని తెలంగాణ వైన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మద్యానికి బానిస అయిన కొంతమంది మద్యం షాపుల తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ దృష్ట్యా, లోకల్ పోలీస్ లేదా పెట్రోలింగ్ పోలీస్ అధికారుల ద్వారా మద్యం షాపుల దగ్గర ఎవరైనా కనిపిస్తే చర్యలు

    READ MORE
  • పని చేస్తున్న లాక్ డౌన్

    ముంబై: లాక్ డౌన్ ముందు కరోనా పని చేయటం లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం ట్వీట్లో వ్యాఖ్యానించారు.‘ఇప్పుడేం చేయాలి కరోనా? నెలకు 30 రోజులేమో ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడ్ని, కానీ, మొదటి సారిగా నెలకు 1000 రోజులు ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాలం అస్సలు కదలడం లేదు. ఏదేమైనా లాక్ డౌన్ పని చేస్తోంది. దాని ముందు కరోనా పని చేయడం లేదని తెలుస్తోంద’న్నారు.

    READ MORE
  • హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు

    హైదరాబాద్ : కర్ణాటకలోని బీదర్ నుంచి కేంద్ర పారామిలటరీ, ఇతర బలగాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 80 వాహనాలలో ఈ బలగాలు జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, క్రాస్‌రోడ్‌, పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుమీదగా హైదరాబాద్ చేరుకున్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. బలగాలు కావాలని తాము కేంద్రాన్ని కోరలేదని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారు ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు