223 మంది ఉద్యోగుల్ని తొల‌గిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు

223 మంది ఉద్యోగుల్ని తొల‌గిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా సంచ‌ల‌న నిర్ణ‌యం యం తీసుకున్నారు. ఢిల్లీ మ‌హిళా క‌మీష‌న్‌కు చెందిన 223 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా ఆదేశాలు జారీ చేశారు. త‌క్ష‌ణ‌మే ఆ ఆదేశాలు అమ‌లులోకి రానున్నాయి. గ‌తంలో ఢిల్లీ మ‌హిళా క‌మీష‌న్ చైర్‌ ప‌ర్స‌న్‌గా ప‌నిచేసిన స్వాతిమాలివాల్ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, ఎటువంటి అనుమతి లేకుండా ఉద్యోగుల‌ను నియ‌మించార‌ని, రూల్స్‌కు వ్య‌తిరేకంగా నియామ‌కం జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆఫీసు తాజా ఆదేశాల‌ను జారీ చేసింది. కేవ‌లం 40 మంది ఉద్యోగుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తూ ఢిల్లీ మ‌హిళా క‌మీష‌న్ ఆదేశాలు ఇచ్చింద‌ని, కానీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి లేకుండా 223 కొత్త పోస్టుల‌ను అప్రూవ్ చేశార‌ని ఆర్డ‌ర్‌లో పేర్కొన్నారు. ఉద్యోగుల‌ను కాంట్రాక్టు ఆధారంగా నియ‌మించే అధికారం క‌మీష‌న్‌కు లేద‌ని ఆ ఆదేశాల్లో తెలిపారు. ఆర్ధికశాఖ‌పై భారం ప‌డే ఎటువంటి నిర్ణ‌యాల‌ను క‌మీష‌న్ తీసుకోవ‌ద్దు ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos