తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • ఆ సిరీస్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే అంతే సంగతులు..

    ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా +92, +1, +968, +44 పాటు +473, +809, +900 సిరీస్‌లతో కూడిన ఫోన్ నంబర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఎవరికైనా ఈ సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ వచ్చినపుడు తెలియకుండా ఫోన్ తీస్తే మాత్రం మీ సమస్త సమాచారం గల్లంతుకావడం ఖాయమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ మేరకు

    READ MORE
  • కళా తపస్వికి చిరు పాదాభివందనం

    హైదరాబాద్: మాస్ హీరోగా ఉన్న తనను క్లాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన కళాతపస్వి, దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. దీపావళి సందర్భంగా సతీ సమేతంగా ఆయన ఇంటికి చేరుకుని గురువుగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విశ్వనాథ్ దంపతులకు కొత్త వస్త్రాలు పెట్టి పాదాభిందనం చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో

    READ MORE
  • హైదరాబాద్ : తెలంగాణలో బాణాసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్ క్రాకర్స్కు అనుమతినిచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. సుప్రీంకోర్టు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు