తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • padma rao goud ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక పదవుల ఎంపిక ప్రక్రియలు వేగవంతం చేసారు.ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌ శుక్రవారం బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పదవికి మాజీ మంత్రి పద్మారావ్‌గౌడను ప్రతిపాదించారు.శనివారం నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ పదవికి తమ అభ్యర్థిని ఖరారు చేశారు.

    READ MORE
  • రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

    తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం  ప్రారంభమయ్యాయి. సరిగ్గా 12.12 గంటల వేళలో కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరవీరులకు సంతాపం తెలిపారు. అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. జవాన్ల వీర మరణానికి సభ రెండు నిమిషాల మౌనం పాటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో

    READ MORE
  • ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం..

    కాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుంబాలకు మనం అండగా నిలువాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉగ్రవాద చర్యను ఖండించారు. జవాన్లపై జరిగిన దాడిని .. యావత్ భారత్ పై జరిగిన దాడిగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు