గులాబిబాస్‌ మరో కీలక నిర్ణయం…

padma rao goud

ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి
కేసీఆర్‌ పలు కీలక పదవుల ఎంపిక ప్రక్రియలు వేగవంతం చేసారు.ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో
ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌ శుక్రవారం బడ్జెట్‌ సమావేశాలు
ముగిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పదవికి మాజీ మంత్రి పద్మారావ్‌గౌడను ప్రతిపాదించారు.శనివారం
నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ పదవికి తమ అభ్యర్థిని ఖరారు చేశారు. గతంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన పద్మారావు గౌడ్ ను ఈ పదవికి ఎంపిక చేశారు. జంట నగరాల్లో సీనియర్ నేతగా – మంత్రిగా మంచి గుర్తింపు ఉన్న పద్మారావుకు…రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.పద్మారావుగౌడ్‌
విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా
సీఎల్పీ కార్యాలయానికి చేరుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి .. డిప్యూటీ
స్పీకర్ ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క
ఈ అంశంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి చెపుతానని తెలిపినట్టు సమాచారం.
అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు కూడా మద్దతు తెలుపాలని ప్రస్తావించినట్టు
తెలుస్తోంది. దీనికి కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేనట్టు విశ్వసనీయ సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos