ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం..

ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం..

కాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
వారి కుటుంబాలకు మనం అండగా నిలువాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని
తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని
ప్రకటించారు. తర్వాత మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉగ్రవాద చర్యను ఖండించారు.
జవాన్లపై జరిగిన దాడిని .. యావత్ భారత్ పై జరిగిన దాడిగా చూస్తున్నామని చెప్పారు భట్టి
విక్రమార్క. అమరవీరులకు ఎంఐఎం నివాళులర్పించంది. ఉగ్రవాదానికి మనమంతా వ్యతిరేకంగా పోరాడాల్సిన
అవసరం ఉందని ఆ పార్టీ నేత బలాల అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు..  ముఖ్యమంత్రులు.. నేతలు.. రియాక్ట్ అయ్యారే కానీ.. ఎవరూ ఇంత భారీ పరిహారాన్ని వీరజవాన్ల కుటుంబాలకు ప్రకటించింది లేదు. వీర జవాన్లకు భారీ పరిహారం ఇవ్వాలన్న సూచన వినిపించినా పట్టించుకున్నది లేదు. అందుకు భిన్నంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల దృష్టి ఆయన మీద పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos