తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయానికి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు నిన్న ఒక్క రోజే హుండీ

    READ MORE
  • ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జులై 15కి వాయిదా

    న్యూ ఢిల్లీ: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటు చేసి విస్తఅత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని.. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ తరఫు న్యాయవాది తెలపగా.. కోర్టు

    READ MORE
  • చరిత్ర సృష్టించబోతున్నాం

    విజయ వాడ: ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐప్యాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

    READ MORE
  • సిద్ధిపేట్‌ డీసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు..

    తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. సిద్ధిపేట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోన్న ఈ సోదాల్లో ఇప్పటివరకు నర్సింహారెడ్డికి సంబంధించిన రూ.5 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.హైదరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి లోని నర్సింహారెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.మరోవైపు నర్సింహారెడ్డి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నర్సింహారెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్, హైదరాబాద్ లోని

    READ MORE
  • వెలుగులోకి దిశ నిందితుల దారుణాలు..

    దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.దిశ హత్యాచారం తరహాలోనే నిందితులు ఆరీఫ్‌,చెన్నకేశవులు తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో తొమ్మిది హత్యాచారాలకు తెగబడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దిశ కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ ఆరుగురిని హత్య చేయగా, చెన్నకేశవులు ముగ్గురిని అంతమొందించినట్టు చెప్పారు.ఈ ఘటనలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం హత్య చేసి

    READ MORE
  • శాశ్వతంగా క్లోజ్‌ ‘దిశ’గా అడుగులు..

    దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో మానవ హక్కుల విచారణ ఎదుర్కొంటున్న పోలీసులు కేసును శాశ్వతంగా క్లోజ్‌ చేయడానికి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. చార్జిషీట్ కాకుండా కోర్టులో కేసుకు సంబంధించి రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఉనికిలోకి రాకపోవడంతో షాద్‌నగర్‌ కోర్టులోనే ఈ నెలాఖరు నాటికి రిపోర్టు దాఖలు చేయనున్నారు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదికలు సీసీ టీవీ ఫుటేజీ ఘటన సమయంలో నిందితులు ఉపయోగించిన

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు