శాశ్వతంగా క్లోజ్‌ ‘దిశ’గా అడుగులు..

శాశ్వతంగా క్లోజ్‌ ‘దిశ’గా అడుగులు..

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో మానవ హక్కుల విచారణ ఎదుర్కొంటున్న పోలీసులు కేసును శాశ్వతంగా క్లోజ్‌ చేయడానికి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. చార్జిషీట్ కాకుండా కోర్టులో కేసుకు సంబంధించి రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఉనికిలోకి రాకపోవడంతో షాద్‌నగర్‌ కోర్టులోనే నెలాఖరు నాటికి రిపోర్టు దాఖలు చేయనున్నారు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదికలు సీసీ టీవీ ఫుటేజీ ఘటన సమయంలో నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్ బాధితురాలి సెల్ఫోన్ టవర్ లొకేషన్లతోపాటు సాంకేతిక ఆధారాలు 30 మందికిపైగా విచారించిన పోలీసులు వారు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా కోర్టుకు సమర్పించే రిపోర్టులో పొందుపర్చనున్నారు. దిశ మృతదేహాన్ని మొదట చూసిన సత్యం మొదట ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ హనుమంతు దిశ కుటుంబ సభ్యులు,పెట్రోల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన శివ నవీన్లను గుర్తించి డయల్-100కు ఫోన్ చేసి సమాచారం అందించిన,బంకు క్యాషియర్,దిశ మృతదేహాన్ని తరలించిన లారీ యజమాని,పంక్చర్ దుకాణదారుడు,పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులు ఇతరుల వాంగ్మూలాలను అధికారులు రిపోర్టులో పొందుపరుస్తున్నారు. నిందితులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తు చేసే వీలు లేనందున కేసు క్లోజ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos