తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • కరోనా సినిమా- జాంబీ రెడ్డి

    హైదరాబాదు: మృత్యు ఘోష వినిపిస్తున్న కరోనా ఇతి వృత్తంగా – జాంబీ రెడ్డి పేరిటి చలన చిత్రం తయారవుతోంది.అ, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మే దీనికీ దర్శకుడు. ఫస్ట్ లుక్, ప్రోమోల్ని విడుదల చేసింది. కరోనా సృష్టిస్తున్న విలయం, హారర్ అంశాలతో ఇది రూపొందుతోంది. రాజశేఖర్ వర్మనిర్మాత. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    READ MORE
  • ఆస్తి కోసం అన్నదమ్ముల వేషాలు

    హైదరాబాదు: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఉన్నట్లుండి నటుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ‘తమ్ముడూ పవన్ కళ్యాణ్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా ఉండు. నేను డబ్బు తీసుకుని వస్తాను అంటే నా మాట విన్నావా? అసలు ఎమ్మెల్యే అవకుండానే; ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూసా. ఇంకా సిగ్గు రాలేదు. అన్నయ్య 18 సీట్లు గెలిచాడు. పాలకొల్లులో చిత్తుగా ఓడినా తిరుపతిలో గెలిచాడు. ఇలాంటి వారి

    READ MORE
  • ఐటీ విస్తరణకు ప్రోత్సాహకాలు

    హైదరాబాద్ : ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐటీ పరిశ్రమల కారిడార్గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఉత్తరాన కొంపల్లి, పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం, దక్షిణాన విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల, వాయువ్యంలో కొల్లూరు, ఉస్మాన్‌ నగర్‌తో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు