ఆస్తి కోసం అన్నదమ్ముల వేషాలు

ఆస్తి కోసం అన్నదమ్ముల వేషాలు

హైదరాబాదు: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఉన్నట్లుండి నటుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ‘తమ్ముడూ పవన్ కళ్యాణ్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా ఉండు. నేను డబ్బు తీసుకుని వస్తాను అంటే నా మాట విన్నావా? అసలు ఎమ్మెల్యే అవకుండానే; ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూసా. ఇంకా సిగ్గు రాలేదు. అన్నయ్య 18 సీట్లు గెలిచాడు. పాలకొల్లులో చిత్తుగా ఓడినా తిరుపతిలో గెలిచాడు. ఇలాంటి వారి వల్ల కాపులకు నష్టం జరుగుతుంది. చిరంజీవి కాంగ్రెస్లో కలిసిపోయాడు. 2014లో భాజపా తెదేపాలకు ప్రచారం చేసాడు. తర్వాత మతతత్వ పార్టీ లంటూ తిట్టి.. తిరిగి మాయావతి కాళ్లపై పడ్డాడు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులను పొగిడి ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో చేరవయ్యాడు. ఒక మాట మీద నిలబడకపోవడం వల్లే పేరు కూడా చెప్పలేని ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న పిచ్చోడు నీ పైన సినిమా తీసాడు. పవన్ కళ్యాణ్ అందరి చేతా ఛీ అని ఎందుకు అనిపించుకుంటావు? అన్నకంటే తమ్ముడు ఇంతిలా దిగజారి పోవడానికి సిగ్గుగా లేదా? కాంగ్రెస్ పని అయిపోయింది. ఇప్పుడు తమ్ముడు భాజపాతో ఉంటే ఆస్తుల్ని కాపాడుకోవచ్చు. పదవులు వస్తాయని అన్నింటికి సిద్దపడిపోయాడు చిరంజీవి. బాధతో ఆత్మ వేదనతో ఇలా మాట్లాడుతున్నాను. నా మాట విన్నావా? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మాట విన్నావా?, నీ జనరల్ సెక్రటరీ మాట విన్నావా?, కమలాకర్ గారి మాట విన్నావా?, ఎంతమంది చెప్పినా వినలేదు. నీకు అంత పదవీ దాహం ఎందుకో అర్థం కావడం లేదు. భాజపా ఉన్నంత కాలం నీవు ముఖ్యమంత్రి కాలేవు. బుద్ది తెచ్చుకుని మారాలి. లేదంటే ఆ డాన్స్లు వేసుకుని సినిమాలకు పోవాలి. రాజకీయాల్లో ఉండి ప్రజలకు అన్యాయం చేయడం ఎందుకు? ఇంకెన్ని వేషాలు వేస్తాడో, ప్రజలారా అందరూ కలిసి బుద్ధి చెప్పండి’ అంటూ శివాలెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos