తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • ఓటీటీ లో సోలో బ్రతుకే సో బెటర్

    హైదరాబాదు : సాయితేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటీటీ సంస్థ చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. సుబ్బు దీని దర్శకుడు.

    READ MORE
  • కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా

    హైదరాబాదు : రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ కథ. రామ్ పెదనాన్న స్రవంతీ రవికిశోర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించనున్నారు. హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి దీనికి మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. రామ్ తొమ్మిదేళ్ల క్రితం చేసిన సినిమా ‘కందిరీగ’. కెమెరా మేన్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం అది

    READ MORE
  • నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్

    హైదరాబాదు: నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ ఒక చిత్రంలో నటించనున్నారు. దీని అంచనా బడ్జెట్ రూ.20 కోట్లు. సి.కల్యాణ్, జీవిత రాజ శేఖర్ నిర్మాతలు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు