తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • పదేండ్లలో అన్నీ పిరమే అందుకే బీజేపోళ్లకు ఓట్లేయాల్నా

    రంగా రెడ్డి : ‘రాముడితో పంచాయితీ లేదు.. రాముడు అందరివాడు.. బీజేపీ వ్యక్తి కాదు. రాముడికి బరాబర్ మొక్కుదాం.. కానీ ఈ పదేండ్లలో అన్నీ పిరం చేసినరు.. అందుకు బీజేపోళ్లకు ఓట్లేయాల్నా..? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని పండబెట్టి తొక్కుదాం.. ఓడిద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల న్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వనందుకు వేయాల్నా అని ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా

    READ MORE
  • తెలంగాణవాసులకు చల్లని కబురు

    హైదరాబాదు:భానుడు నిర్దాక్షిణ్యంగా సెగలు కక్కుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి దంచేస్తుండడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీనికితోడు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసు కొచ్చింది. రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులు,

    READ MORE
  • బీజేపీ నేత‌ల‌ ‘ప్రధాని’ వ్యాఖ్యలపై కేటీఆర్ చుర‌క‌లు

    హైదరాబాదు: బీజేపీ నేతలు భారత తొలి ప్రధానమంత్రి విషయమై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా చురకలు అంటించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న సినీ నటి కంగనా రనౌత్ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర భారత తొలి ప్రధాని అని నోరు జారారు. ఇదే విషయమై ‘ఎక్స్’ వేదికగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు