పదేండ్లలో అన్నీ పిరమే అందుకే బీజేపోళ్లకు ఓట్లేయాల్నా

పదేండ్లలో అన్నీ పిరమే అందుకే బీజేపోళ్లకు ఓట్లేయాల్నా

రంగా రెడ్డి : ‘రాముడితో పంచాయితీ లేదు.. రాముడు అందరివాడు.. బీజేపీ వ్యక్తి కాదు. రాముడికి బరాబర్ మొక్కుదాం.. కానీ ఈ పదేండ్లలో అన్నీ పిరం చేసినరు.. అందుకు బీజేపోళ్లకు ఓట్లేయాల్నా..? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని పండబెట్టి తొక్కుదాం.. ఓడిద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల న్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వనందుకు వేయాల్నా అని ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలని.. తెలం గాణలోని ఐదు మండలాలను గుంజుకు న్నందుకా..? భద్రాద్రి రామున్ని పట్టించుకోనందుకా..? కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనుందుకా..? ఐటీఐఆర్ రద్దు చేసినందుకా..? నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఇవ్వనందుకా..? అని అడిగారు. రాముడిని అడ్డం పెట్టుకుని తాము రాజకీయం చేస్తామంటే వారి నిజస్వరూపం బయటపెడతామని తెలిపారు. ఎంతో అద్భుతంగా నిర్మించిన యాదాద్రిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, ప్రజల ఆశీర్వాదంతో 12 సీట్లు వస్తే బీఆర్ఎస్సే చక్రం తిప్పే పరిస్థితి రావొచ్చని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను ఆచరణలో చేసి చూపెడుతున్నది కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. 1008 గురుకుల పాఠశాలలను కేసీఆర్ స్థాపించారని, ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు రూ.లక్షా 20 వేల చొప్పున ఖర్చు పెట్టి చదివించి, ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా గురుకుల విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. రూ.11 వేల కోట్లతో గొర్రెల పెంపకం అమలు, రూ.30 వేల కోట్లతో మత్స్యకారులకు మత్స్య సంపద సృష్టించినట్టు చెప్పారు. ఫూలే, అంబేద్కర్కు దండేసి దండం పెట్టుడు వేరని, వారి ఆశయాలను కొనసాగించేలా చేతల్లో చేసి చూపించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos