తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో మజ్లీస్

    లక్నో : బిహార్ ఫలితాల ఊపులో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ యూపీపై కన్నేసారు. అక్కడి చిన్నా చితక పార్టీలతో కలిసి, పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదాలోకి దిగనున్నారు. ఆ పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. భారతీయ సమాజ్పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్భర్ తో సమావేశమయ్యారు. సమాజ్వాదీ నుంచి విడిపోయిన వేరు కుంపటి పెట్టుకున్న శివపాల్ యాదవ్, ఒవైసీ పరస్పరం ప్రశంసించు కున్నారు. భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్భర్ నేతృత్వంలో బాూబు సింహ్ (కుష్వాహ

    READ MORE
  • తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 305 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,75,836 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,059 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 4,728 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,64,049 మంది

    READ MORE
  • తేజ చిత్రంలో కథానాయిక కృతిశెట్టి

    హైదరాబాదు: దర్శకుడు తేజ గోపీచంద్ హీరోగా అలిమేలుమంగ- వేంకట రమణ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో అలిమేలుమంగ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండడంతో చక్కని అభినేత్రి ఎంపికకు ప్రయత్ని స్తున్నారు. కాజల్, సాయిపల్లవిని సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. తాజాగా కృతిశెట్టి పేరు వినిపిస్తోంది. ఆమె ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఉప్పెన చిత్రం ద్వారా ఈ కన్నడ నటి ముద్దుగుమ్మ ప్రస్తుతం నాని సరసన శ్యామ్ సింగరాయ్ లో నటిస్తోంది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు