తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం..

    కాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుంబాలకు మనం అండగా నిలువాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉగ్రవాద చర్యను ఖండించారు. జవాన్లపై జరిగిన దాడిని .. యావత్ భారత్ పై జరిగిన దాడిగా

    READ MORE
  • మంత్రివర్గ కూర్పు వెనక ఆసక్తికర అంశం…

    ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గం కోలువుదీరింది.అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తెరవెనుక జరిగిన ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.మంత్రి వర్గంలో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంపై సీఎం కేసీఆర్‌ ముందుగానే ఫైనల్‌ చేసుకున్నారని తెలుస్తోంది.సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రి పదవులు దక్కిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని మంత్రి పదవి దక్కిన వార్త తెలియజేసి వారిని

    READ MORE
  • ఎట్టకేలకు ఫలించిన దయాకర్రావు కల…

    తన మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడు కలగని సంతోషం ఇవాళ కలుగుతోందంటూ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు.సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలో కీలకమైన పంచాయితీ రాజ్‌శాఖ లభించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.తనకు గతంలోనే మంత్రి పదవి రావాల్సిందని గుర్తు చేసుకున్న దయాకర్‌ రావు గతంలో ఎన్టీఆర్‌ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆసక్తి కనబరిచారని అయితే కొన్ని దుష్టఃశక్తులు తనకు మంత్రి లభించకుండా అడ్డుకున్నాయని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు