తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • ఎవరికీ భయపడను

  అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ‘దమ్ముంటే రా’ అని సవాల్ విసిరారు. ‘నువ్వు రా’ అంటూ అంబటి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… అంబటి రాంబాబు

  READ MORE
 • తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

  READ MORE
 • విజయదశమి నుంచి విశాఖలో జగన్ పాలన

  విశాఖ: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగించనున్నారని, రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని, మళ్లీ జగనే సీఎం అవ్వాలని గణనాధుడిని పూజించామన్నారు. మూడు రాజధానులకు న్యాయ పరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయిందని, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

  READ MORE
 • మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

  హైదరాబాద్: బీజేపీకి మహిళల పట్ల అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండు చేశారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంత బీజేపీ కోసమేనని,

  READ MORE
 • రేపు మంత్రి వర్గ సమావేశం

  హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్‌లో జరుగనుంది. శాసన సభలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా పది మంది మంత్రి వర్గంలో చేరిన తర్వాత జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా కొత్త మంత్రులకు సీఎం శాఖలను కేటాయించారు. ఈటల రాజేందర్‌- వైద్య, ఆరోగ్యం, వేముల ప్రశాంత్‌ రెడ్డి-

  READ MORE
 • చంద్రబాబు, మమతపై కిషన్ రెడ్డి ధ్వజం

  హైదరాబాద్‌ : పుల్వమాలో ఉగ్ర దాడిపై ఆంధ్ర, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీలు మాట్లాడుతున్న తీరు తోడు దొంగలను తలపిస్తోందని బీజేపీ సీనియర్‌ నాయకుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు దాడి జరగడంపై అనుమానాలున్నాయంటూ మమతా బెనర్జీ చెప్పడం, దానికి చంద్రబాబు వత్తాసు పలకడం చూస్తుంటే … ప్రపంచానికి వీరు ఏ సంకేతం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. వీరి మాటలు దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని విమర్శించారు.

  READ MORE
 • తెలంగాణ సంక్షేమ పథకాలకు ప్రశంసలు

  హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే. సింగ్‌ కితాబునిచ్చారు. జూబిలీ హాలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పథకాన్ని అభినందిస్తూ, ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచుకుంటూ పోవడం శుభ పరిణామమన్నారు. సొంత పన్నుల రాబడిలో వృద్ధి రేటు బాగుందన్నారు.

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు