తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • దశాబ్దాలుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదం,దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉగ్రవాదం,ఉద్రిక్త సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల మాత్రమే సాధ్యమవుతుందంటూ తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ వ్యాఖ్యానించారు.తెలంగాణ భవన్లో టీఆర్ ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి అంతకు రెండింతల స్థాయిలో ధీటుగా జవాబిచ్చిన భారత వాయుసేనను అభినందిస్తున్నామన్నారు.కశ్మీర్‌ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉండడానికి ప్రధాన కారణం దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూయేనని ఆరోపించారు.నెహ్రూ

    READ MORE
  • డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకునే కొంతమంది సినీనటులు,క్రికెటర్లు ఏమాత్రం ఆలోచించకుండా వాణిజ్య ప్రకటనల్లో నటించి అనంతరం సరదు సంస్థలు నకిలీవని తెలుసుకొని కోర్టులు చుట్టూ తిరగడం దశాబ్ద కాలంగా ఎక్కువగా జరుగుతోంది.తాజాగా క్యూనెట్ మల్టీ లెవెల్ కంపెనీ మోసాల తాలూకు పలువురు నటీనటులు, క్రికెటర్లు తాఖీదులు అందుకున్నారు. మల్టీ లెవెల్ మోసం.. బ్రాండ్ అంబాసిడర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.క్యూనెట్‌ సంస్థ వాణిజ్య ప్రకటనల్లో నటించిన నటీనటులకు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు.ప్రముఖులు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతోనే

    READ MORE
  • హైదరాబాద్‌ నగరంలో మధులికపై ప్రమోన్మాది దాడి చేసిన ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో మరో ప్రేమోన్మాది విద్యార్థినిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో యువకుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్‌చల్లి నిప్పటించాడు.హన్మకొండకు చెందిన రవళి అనే యువతి అదే ప్రాంతంలోని నయీమ్‌నగర్‌లో ఉంటున్నవాగ్దేవి కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నారు.అదే కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న అన్వేష్‌ అనే యువకుడు చాలా కాలంగా ప్రేమ పేరుతో రవళి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు