తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ 37 ఏళ్ల ప్రస్థానంలో తొలిసారిగా తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడా పోటీ చేయడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తెలంగాణలో మంచి పట్టు ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీ ప్రాభవం రోజు రోజుకు మసకబారుతోంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను కేవలం 13 స్థానాల్లోనే పోటీ చేసింది.

    READ MORE
  • తెలంగాణలో 795 నామినేషన్లు

    హైదరాబాద్‌ : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 795 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ మంగళవారం వెల్లడించారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 245 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అక్కడ 95 మంది అభ్యర్థులకు మించి రంగంలో ఉన్నట్లయితే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. కాగా కాంగ్రెస్‌, భాజపా, సీపీఎం, బీఎస్పీ నలభై మంది చొప్పున, తెరాస ఇరవై, ఎంఐఎం ఇద్దరు, జనసేన నలుగురితో కూడిన ప్రచార తారల వివరాలను

    READ MORE
  • వెనక్కి తగ్గిన కేసీఆర్‌..

    నాకు నచ్చిందే చేస్తానన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో మీడియా పుణ్యమా అని.. తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకవటమే కాదు.. మార్చుకోవటం కూడా ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి ప్రతి పార్టీ తన స్టార్ క్యాంపైనర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇదే తీరులో తాజాగా టీఆర్ ఎస్ సైతం తన స్టార్ క్యాంపైనర్లను ప్రకటించింది.ఈ జాబితాలో తెరాస పార్టీ ఆవిర్భవించినప్పటి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు