వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం

విజయవాడ: ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాల్ని అందిం చేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి గురువారం ఇక్కడ ప్రారంభించారు. ‘రాష్ట్రంలో కులాలు, మతాలు, పార్టీలు అని చూడకుండా అందరికీ మంచి జరగాలి. మనకు ఓటు వేయనివారు కూడా మనం చేసే మంచిని చూసి వారి మనసు కరగాలి. మళ్లీ ఎన్నికల్లో మనకు ఓటేయాలి. గ్రామ వాలంటీర్ గా వస్తున్నవాళ్లంతా యువతీయువకులే. వీళ్లంతా గ్రామంలో మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉన్న వ్యక్తులే. ఇటువంటి యువతే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగలరు. అందుకే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామ’న్నారు. ‘ప్రతీ 2000 మందికో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో 10 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దరిమిలా రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీరు బాధ్యత తీసుకోవాలి. ‘నేను ఉన్నాను. నేను విన్నాను’ అన్న భావన కల్పించాలి. గ్రామ వాలంటీర్లుగా 2.80 లక్షల మందిని నియిమించాం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos