కోల్‌క‌తాలో బంగ్లాదేశ్ ఎంపీ అదృశ్యం

కోల్‌క‌తాలో  బంగ్లాదేశ్ ఎంపీ అదృశ్యం

కోల్కతా : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ కోల్కతాలో అదృశ్యమయ్యారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఆయన వైద్య చికిత్స నిమిత్తం మే 12వ తేదీన ఆ నగరానికి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకుండాపోయినట్లు తెలుస్తోంది. కోల్కతా పోలీసులు ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ కోసం అన్వేషిస్తున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన ఆయన మొబైల్ ఫోన్ కూడా ప్రస్తుతం స్విచాఫ్లో ఉన్నట్లు తెలిసింది. బహుశా ఆ ఎంపీని మర్డర్ చేసి మృత దేహాన్ని న్యూటౌన్ ఏరియాలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. గాలింపులు జరుపుతున్నపుడు న్యూటౌన్ ప్రాంతంలో ఓ వ్యక్తి శరీరాన్ని గుర్తించారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos