బంగ్లాదేశ్‌ ఎంపీ కోల్‌క‌తాలో హ‌త్య .. ముగ్గురు అరెస్టు

బంగ్లాదేశ్‌ ఎంపీ కోల్‌క‌తాలో హ‌త్య .. ముగ్గురు అరెస్టు

ఢాకా: బంగ్లాదేశ్కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ను హత్య చేశారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముగ్గురూ బంగ్లాదేశీలు అని , చాలా ప్లాన్ ప్రకారం మర్డర్ జరిగిందని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ వెల్లడించారు. అన్వరుల్ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ఏ కారణం చేత అతన్ని హత్య చేశారో తెలియదని, ఆ విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. జెనాయిదా-4 నియోజకవర్గం నుంచి అజిమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జెనాయిదా సరిహద్దు ప్రాంతమని, అక్కడ నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చికిత్స కోసం కోల్కతా వెళ్లినపుడు ఆయన్ను అక్కడ హత్య చేశారని వివరించారు. అన్వరుల్ మృతి పట్ల ప్రధాని షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos