నెలాఖరు కల్లా రుతు పవనాల రాక

నెలాఖరు కల్లా రుతు పవనాల రాక

న్యూ ఢిల్లీ : నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని మే 31 న చేరే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆలస్యంగా కానీ నైరుతీ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉన్నది. పతనం తిట్ట, ఇడుక్కీ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం కేరళ తీరం వెంట చేపల వేట నిషేధించారు. పశ్చిమ రాష్ట్రాల్లో వడగాడ్పులు వీయను న్నాయని హెచ్చరిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు కాస్తాయని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos