డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా

డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా

న్యూ ఢిల్లీ : డీప్ఫేక్ వీడియోలు, ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. నకిలీలను గుర్తించేందుకు ప్రజలకు అవకగాహక కల్పించేలా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక వీడియో విడుదల చేసింది. ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండానే కేవలం చిన్న చిన్న అంశాలను ఉపయోగించి ఏఐతో సృష్టించే ఫేక్ ఫొటోలను గుర్తించొచ్చని చెబుతోంది. ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే వాస్తవానికి దూరంగా ఉండే చిత్రాలు, వింత వింత లైటింగ్, నీడలు తదితర వాటిని గుర్తుపట్టొచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక్కో అంశాన్ని వీడియోలో వివరించింది. నకిలీ ఫొటోల్లో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లు అసహజంగా కనిపిస్తాయి. ఫొటోల్లో కనిపించే నీడలు కూడా తేడాగా ఉంటాయని తెలిపింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే వాస్తవమేదో, నకిలీ ఏదో ఇట్టే కనిపెట్టొచ్చని సూచించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos