కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ గ్రాఫిటీ.. వ్య‌క్తి అరెస్టు

కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ గ్రాఫిటీ.. వ్య‌క్తి అరెస్టు

న్యూ ఢిల్లీ : సీఎం అరవింద్ కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తూ గ్రాఫిటీ వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని అంకిత్ గోయల్గా గుర్తించారు. ఓ మెట్రో స్టేషన్లో ఆ వ్యక్తి కేజ్రీవాల్ను బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన మెట్రో యూనిట్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితుడు అంకిత్ గోయల్ వయసు 33 ఏళ్లు. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మెట్రో స్టేషన్లో ఓ గోడపై ఓ వ్యక్తి గ్రాఫిటీ వేస్తున్న దృశ్యాలను సీసీటీవీ ద్వారా గుర్తించారు. సోమవారం ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైన్బోర్డులు, కోచ్ల మీద రాతలు రాస్తున్న వ్యక్తిని సీసీటీవీ ద్వారా పసికట్టారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనూ ఆ గ్రాఫిటీ ఫోటోలను అతను పోస్టు చేసుకున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos