వింక్‌గర్ల్‌ కళ్లు రౌడీ మీద పడ్డాయేంటో!

  • In Film
  • August 9, 2019
  • 87 Views
వింక్‌గర్ల్‌ కళ్లు రౌడీ మీద పడ్డాయేంటో!

నాలుగు నిమిషాల పాటలో ఐదు సెకన్లు కొంటెగా కన్నుగీటి రాత్రికిరాత్రి నేషనల్‌ క్రష్‌గా పాపులరైన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌,అర్జున్‌రెడ్డి ఒకేఒక్క చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ఒకే గదిలో తీసుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ప్రచారంలో భాగంగా కేరళకు వెళ్లిన సమయంలో విజయ్‌తో కలసి తీసుకున్న ఫోటోను ప్రియా తన సామాజిక మాధ్యమాల ఖాతాలో షేర్‌ చేయడంతో గంటల వ్యవధిలోనై వైరల్‌గా మారింది.ఫోటోతో పాటు నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ ప్రియా ట్యాగ్‌ చేయడంతో అభిమానులు,నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.‘‘రౌడీ బేబీస్ అంటే ఇలాగే ఉంటారు.. ఏంటి? మా వాడిపై పడ్డాయి నీ కళ్ళు” అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

View this post on Instagram

Nuvvante naaku chala ishtam😋

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

తాజా సమాచారం

Latest Posts

Featured Videos