రాజ్‌తరుణ్‌ కారుకు ప్రమాదం!

రాజ్‌తరుణ్‌ కారుకు  ప్రమాదం!

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌లో్ తెలుగు చిత్ర పరిశ్రమ యువనటుడు రాజ్‌తరుణ్‌ కారుకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.కారులో(TS09 Ex 1100 ) హైదరాబాద్‌కు వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని తెలుస్తోంది.డివైడర్‌ను ఢీకొట్టిన కారు నాలుగు పల్టీలు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే, ప్రమాదం జరిగిన తీరు.. కారు పల్టీలు కొట్టిన పరిస్థితులు గమనిస్తే ఇది అతివేగం వల్లే జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని సమాచారం. మితిమీరిన వేగం వల్ల కారు అన్ని పల్టీలు కొట్టిందని కూడా స్థానికులు చెబుతున్నారని తెలుస్తోంది.ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్చిన్న చిన్న గాయాలతో స్వయంగా బయటకు వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. తర్వాత అతడు ఫోన్లో ఎవరికో సమాచారం అందించాడని అంటున్నారు. వాళ్లు కారులో వచ్చి రాజ్ తరుణ్ను అక్కడి నుంచి తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అయితే, ఎక్కడికి తీసుకెళ్లారన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. పోలీసులు కూడా రాజ్ తరుణ్ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.ప్రమాదానికి నిద్రమత్తే కారణమై ఉంటుందని భావిస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos