మండనున్న ఎండలు

మండనున్న ఎండలు

అమరావతి: రాష్ట్ర ప్రజలు శుక్రవారం నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ముప్పూ ఉంది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయి. గుంటూరు జిల్లా రెంట చింతలలో సూరీడు గురువారం ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత దాఖలైందని వాతావరణ శాఖ సంచాలకి స్టెల్లా తెలిపారు. ప్రజలు సోమవారం వరకూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని సూచించారు. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos