క‌ర్నాట‌క‌లో టాటా గ్రూప్ కీల‌క‌ ప్రాజెక్టులు

క‌ర్నాట‌క‌లో టాటా గ్రూప్ కీల‌క‌ ప్రాజెక్టులు

బెంగళూరు: కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. కర్నాటక ప్రభుత్వం, టాటా గ్రూప్ కంపెనీలు ఎయిర్ ఇండియా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ మేరకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం ఖరారైంది. ఒప్పందం ప్రకారం కర్నాటకలో టాటా గ్రూప్ పలు తయారీ, ఆర్అండ్డీ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎయిర్ఫ్రేం మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) నెలకొల్పుతుందని మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్తో 1200 మందికిపైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.ఇది భారత్లో ఈ తరహా తొలి ఫెసిలిటీ అని మంత్రి వివరించారు. దీంతోపాటు బెంగళూర్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఏవియేషన్ హబ్ను ఏర్పాటు చేస్తుందని, ఫలితంగా బెంగళూర్లో ఎయిర్ ట్రాఫిక్ పెరగడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్ధిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos