ఆ తప్పు పాలకులదే

ఆ తప్పు పాలకులదే

నెల్లూరు: ఢిల్లీ నిజాముద్దీన్లో తబ్లీగ్ జమాత్ ఇస్లామి నిర్వహణలో కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలున్నాయని జమాత్ ఇస్లామి హిందూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుబహాన్ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కేంద్రం తన నిర్లక్ష్య వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముస్లింలపై నిరాధార ఆరోపణలు చేస్తోంది. తబ్లీగ్ జమాత్ సమావేశం మార్చి 13, 14, 15లలో జరిగాయి. ప్రతి ఏటా ఇవి అక్కడ జరుగుతాయి. జనవరి 30న కరోనా మృతి మన దేశంలో సంభవించింది. ఈ సమావేశాల ద్వారా ప్రబలే ప్రమాదం ఉందని భావించినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ సమావేశాలను రద్దు చేయలేదు. సమావేశాలు నిర్వహించవద్దని మత పెద్దలను పిలిచి చెప్పామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. అయితే చెప్పడం, నిషేధించడంలో చాలా తేడా ఉంది. నిషేధిస్తే ఎవరూ సమావేశం నిర్వహించడానికి అవకాశం ఉండదు. ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటించటంతో సమాశానికి వచ్చిన 1500 మంది అక్కడే ఉండిపోయారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం అనుమతి వాళ్లను గమ్య స్థానాలకు బస్సుల్లో పంపిస్తామని మత పెద్దలు లేఖలు రాసారు. తబ్లీగ్ జమాత్ నిర్లక్ష్యం ఎంతమాత్రం లేద’ని స్పష్టీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos