ఆజాద్‌కు అవరోధం

ఆజాద్‌కు అవరోధం

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శ్రీనగర్ విమానాశ్రయం బయటకు వెళ్లకుండా గురువారం ఉదయం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన శ్రీనగర్‌లోకి ఆయన ప్రవేశించడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఈ చర్య తీసుకున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. గులాంబీ నబీని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని, ఒక వేళ ఆయన కోరితే తిరిగి ఢిల్లీకి పంపిస్తామని తెలిపారు. 370 అధికరణ రద్దయిన తర్వాత శ్రీనగర్ ప్రజలతో మాట్లాడి పరిస్థితులు అడిగి తెలుసుకోదలచారు. అక్కడి పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. స్థానికులతో కలిసి రోడ్డు పక్కనే భోజనం చేశారు.‘డబ్బులిస్తే అలాంటి వాళ్లు చాలా మంది వస్తార’ని గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos