అత్యాచారాల నిందితులకు ఇక మూడినట్టే..

అత్యాచారాల నిందితులకు ఇక మూడినట్టే..

శిక్షలు బలహీనంగా ఉండడం చట్టాల్లో లొసుగులను చుట్టాలుగా చేసుకొని ఏమాత్రం భయం లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్న కీచకులు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే.ఎందుకుంటే అత్యాచార ఘటనలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యాచార నిందితులకు నాలుగు నెలల్లో కఠిన శిక్షలు విధించేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. మహిళ భద్రత విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది.డీఎస్పీ నేతృత్వంలో పని చేసే ఈ టాస్క్‌ఫోర్స్‌ విభాగం రాష్ట్రవ్యాప్తంగా అత్యాచారాలు,లైంగిక వేధింపులపై ప్రత్యేక దృష్టి సారించనుంది. అత్యాచారాలపై కేసు నమోదైన రెండు నెలల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో పాటు మరో రెండు నెలల్లో విచారణ కూడా పూర్తి చేసే విధంగా టాస్క్‌ఫోర్స్‌ చర్యలు తీసుకోనుంది.అంటే మొత్తం నాలుగు నెలల్లో అత్యాచార నిందితులకు కఠిన శిక్ష విధించేలా టాస్క్‌ఫోర్స్‌ అడుగులు వేయనుంది.అత్యాచార కేసుల విచారణలో అలసత్వం వహించినా రెండు నెలల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయకపోయినా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళాఈ టాస్క్‌ఫోర్స్‌ విభాగం మహిళ దినోత్సవం రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించింది. అత్యాచారాల బాధితులకు సత్వర న్యాయం అందించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సాంకేతికతను కూడా వినియోగించుకోనుంది.సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అత్యాచార కేసులను కూడా పర్యవేక్షించనుంది.ప్రత్యేక మహిళ టాస్క్‌ఫోర్స్‌లోనే భాగంగా షీ టీమ్‌లు,భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్న పోలీసుశాఖ ఐటీ స్వాతి లక్ర నేతృత్వంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది.అత్యాచార కేసుల్లో అరెస్టయి రెండు రోజుల్లో జైళ్లో గడిపి జామీనుపై బయటకు వచ్చి బాధితులను, సాక్ష్యులను బెదిరించి శిక్ష నుంచి తప్పించుకుంటున్న నిందితులు ఈ ప్రత్యేక మహిళా టాస్క్‌ఫోర్స్‌ విభాగంతోనైనా ఆగాలని ఆశిద్దాం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos