వాసన పట్ట లేరా? ఇదీ కరోనా లక్షణమే

వాసన పట్ట లేరా? ఇదీ కరోనా లక్షణమే

లండన్: కరోనా వైరస్ సోకితే, 14 రోజుల్లోగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ శరీరంలోకి వైరస్ ప్రవేశించిన గంటల్లోనే రెండు కొత్త లక్షణాలు బయటకు వస్తాయని బ్రిటన్కు చెందిన ఈఎన్టీ వైద్యులు గుర్తించారు. వైరస్ సోకిన వారు తొలుత వాసనను, తినే ఆహార పదార్థాల రుచిని కూడా పసిగట్టలేరని ని వెల్లడించారు. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరడానికి ముందు ముక్కులో ఆగుతుంది. అందువల్ల వాసన చూసే సామర్థ్యం పోతుందని తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే యువత వైరస్ బారిన పడినప్పటికీ అన్ని లక్షణాలూ బయటపడే లోపే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయన్నారు. హఠాత్తుగా తాము వాసన పసిగట్టే సామర్థ్యానిన కోల్పోయామంటూ తన క్లినిక్ కు వచ్చే రోగుల ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని, కారణం కనుక్కునే ప్రయత్నాల్లో తానుండగా, వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్టు తెలిసిందని బ్రిటన్ ఈఎన్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ తెలిపారు. వాటి నివారణకు స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్లను వారం రోజుల పాటు అందించాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos