సైబర్‌ నేరం రద్దుకు శివాజి వినతి

సైబర్‌ నేరం రద్దుకు శివాజి వినతి

హైదరాబాద్: తనకు వ్యతిరేకంగా సైబర్ నేర పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని సినీ నటుడు శివాజీ బుధవారం ఉన్నత న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పోలీసులు తనను ముందస్తు అరెస్ట్ చేయకుండా నిలువరించాలని కూడా కోరారు. దీనిపై బుధవారం ఉన్నత న్యాయ స్థానంలో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ కేసులో రవి ప్రకాశ్ వ్యాజ్యం పై తీర్పు వాయిదా పడినందున గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శివాజీకి మూడు సార్లు పోలీసులు తాఖీదుల్ని జారీ చేసినా విచారణకు హాజరు తప్పు బట్టారు. దీని పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos