వెల్లివిరిసిన మానవత

వెల్లివిరిసిన మానవత

బులంద్ షహర్ : ఆయువు తీరిన నిరుపేద హిందువుకు ముస్లింలు అంత్యక్రియలు జరిపి మానవతను ప్రదర్శించారు. మతసామరస్యాన్ని చాటారు. మతాల అడ్డు గోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు.ఇక్కడి మౌలానా ఆనంద్ విహార్లో రవిశంకర్ అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్డౌన్ వల్ల అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు. రవిశంకర్ అంత్యక్రియల్లో సాయం చేశారు. స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని స్మశానానికి తరలించారు. ‘రామ్ నామ్ సత్య హై’ నినాదాలు చేసి మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు.‘లాక్డౌన్ కారణంగా బంధువులు రాలేకపోయారు. ముస్లిం సోదరుల అండతో మా తండ్రి అంత్యక్రియలు నిర్వహించామ’ని రవిశంకర్ కుమారుడు చెప్పారు.లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో బులంద్షెహర్ ముస్లింలు చూపిన మానవత్వం యావత్ దేశానికి ఆదర్శం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos