పాక్‌ క్రికెట్‌ బోర్డుకు భారీ బిర్యానీ బిల్లు

  • In Sports
  • September 23, 2021
  • 93 Views
పాక్‌ క్రికెట్‌ బోర్డుకు భారీ బిర్యానీ బిల్లు

ఇప్పటికే నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉన్నట్లయితే..పాక్ జట్టు సొంత గడ్డపైనే న్యూజిలాండ్ తో సిరీస్ ఆడుతూ ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో కివీస్ ఆ సిరీస్ ను రద్దు చేసుకొని తిరిగి వెళ్ళిపోయింది. భద్రత కారణంగానే ఈ టూర్ రద్దు చేసుకున్నట్లు ఆ జట్టు తెలిపింది. కివీస్ జట్టు వెళ్లిన తర్వాత పాకిస్థాన్ కు రావాల్సిన ఇంగ్లాండ్ జట్టు కూడా తన టూర్ ను రద్దు చేసింది. దాంతో పాకిస్థాన్ బోర్డుకు భారీ నష్టం వచ్చింది. ఆ నష్టాన్నే ఎలా పూడ్చాలో తెలియక సతమతమవుతున్న పాక్ బోర్డుకు ఇప్పుడు మరో సమస్య వచ్చింది. ఏకంగా రూ.27 లక్షల బిర్యానీ బిల్లు వచ్చింది.
కివీస్ జట్టు పాక్‌లో అడుగు పెట్టిన సమయం నుండి వారికి రక్షణ కల్పించడానికి ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ స్థాయిలకు చెందిన మొత్తం 500 మందికి పైగా పోలీసులు ఉన్నారు. విలియమ్సన్ సేన పాక్ లో ఉన్న వారం రోజులు వారికి రక్షణ కల్పించారు. అయితే ఇదే వారం రోజుల్లో ఆ పోలీసుల బృందం ఏకంగా రూ.27 లక్షలు విలువ చేసే బిర్యానీని భోంచేసేసింది. ఇప్పుడు ఆ బిర్యానీకి సంబంధించే బిల్లే పాక్ బోర్డు వద్దకు వచ్చింది. దాంతో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడింది పాక్ క్రికెట్ బోర్డు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos