మా దేశంలో కరోనా లేదు

మా దేశంలో కరోనా లేదు

పాంగ్వంగ్ : ‘కరోనా తమ దేశంలోకి ప్రవేశించలేదు.మాది పూర్తిగా కరోనా రహిత దేశమ’ని ఉత్తర కొరియా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు శుక్ర వారం ఇక్కడ ప్రకటించారు. పొరుగు దేశం చైనాలో తొలి కరోనా పాజిటివ్ కేసు బయటపడిన వెంటనే సరిహద్దులన్నీ మూసి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కఠినమైన చర్యలు చేపట్టినందున తమ దేశంలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని యాంటీ-ఎపిడెమిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పాక్ మియాంగ్ సు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. అయినా ఆయన ఈ ప్రకటన చేయడం అనుమానాలను రేకెత్తిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos