హీరో నిఖిల్‌ చేసిన పనికి హ్యాట్సాఫ్‌..

  • In Film
  • June 26, 2019
  • 126 Views
హీరో నిఖిల్‌ చేసిన పనికి హ్యాట్సాఫ్‌..

ప్రస్తుత తెలుగు నటీనటుల్లో తమ కెరీర్‌తో పాటు సామాజిక బాధ్యతలపై కూడా దృష్టి సారిస్తుండడం అభినందించదగ్గ పరిణామమం.అభిమానులతో పాటు పేదలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు యువ నటీనటులు స్పందిస్తు తీరుకు అభినందించి తీరాల్సిందే.తాజాగా వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్‌ హీరో నిఖిల్‌ తనలోని సామాజిక సేవా కోణాన్ని ఆవిష్కరించారు.భీమవరం ప్రాంతానికి చెందిన 300 మంది పేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుకు అయ్యే పూర్తి ఖర్చు భరిస్తానని పేర్కొన్నారు.పాఠశాలలో విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేసి .‘భీమవరానికి చెందిన ఈ 300 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడం నుంచి చదువు పూర్తయ్యే వరకూ అన్నీ బాధ్యతలు చూసుకుంటా. ఈ గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం కల్పించిన మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.నిఖిల్‌ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం మెచ్చుకుంటున్నారు.నిఖిల్ భవిష్యత్ లో ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos