అవార్డులు బాధ్యతను పెంచాయి

  • In Film
  • August 9, 2019
  • 111 Views
అవార్డులు బాధ్యతను పెంచాయి

హైదరాబాద్ : ‘అ!` సినిమాకు రెండు జాతీయ అవార్డులు లభించడం పట్ల నిర్మాత, కథా నాయకుడు నాని సంతోషం వ్యక్తం చేశారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఆయన తొలిసారిగా ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లోఈ చిత్రానికి మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో అవార్డులు లభించాయి. దీనిపై స్పందించిన నాని ఈ గౌరవం తమ బాధ్యతను పెంచిందన్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించామని తెలిపారు. సరికొత్త కథాంశంతో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుందని చెప్పారు. కాగా ఈ సినిమాలో కాజల్, నిత్యా మేనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos