నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాలతో ఆరంభ మయ్యాయి. ఉదయం 9.40గంటల వేళలో సెన్సెక్స్‌ 360 పాయింట్లకు పైగా నష్టంతో 37,803 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 104 పాయింట్లు కోల్పోయి 11,352 వద్ద కదలాడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ69.08 గా ట్రేడయింది. 2019లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ ఫెడరల్‌ రిజర్వ్ ఇచ్చిన సంకేతాలకు ప్రపంచవ్యాప్తంగా మదుపల్ల సెంటిమెంటు దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ వ్యతిరేకంగా స్పందించాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. టాటా మోటార్స్‌ షేర్లు రెండు శాతం మేర నష్టాల్లో కొనసాగాయి. కార్ల ధరల్ని పెంచనున్నట్లు టాటా చేసిన ప్రకటన ఫలితమిదని నిపుణులు పేర్కొన్నారు. బ్యాంకింగ్‌, ఫార్మా, లోహ, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. వోల్టాస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, వేదాంత, యస్‌బ్యాంకు, డీఎల్‌ఎఫ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐఓసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos