బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం జోరు

బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం జోరు

పాట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ జోరు కోనసాగిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన వోట్ల లెక్కింపు ప్రకారం నాలుగు నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదట ముగ్గురు అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నప్పటికీ కౌంటింగ్ నడుస్తున్నా ఒకరు ఆధిక్యతను కోల్పోయారు. ఉన్నట్లుండి మరో రెండు స్థానాల్లో ఆధిక్యత పెరగింది. ఎంఐఎం కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం అనే మాటను ఓవైసీ క్రమంగా అధిగమిస్తున్నారు. మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించుకుని హైదరాబాద్ బయటా తాము నిలబడగలమని నిరూపించారు. బిహార్లో 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో కిషన్గంజ్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 3-6 స్థానాల్లో గెలవొచ్చనే ఊహాగానాలు వచ్చాయి. వాటికి అనుగుణంగానే ఎంఐఎం తన ప్రభావాన్ని కనబరుస్తోంది. తుది ఫలితాలు వచ్చే సరికి ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి మరి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos