చెత్తగా ఆడారు

  • In Sports
  • July 25, 2019
  • 156 Views
చెత్తగా ఆడారు

లండన్ : ఐర్లాండ్ చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ కావడం ఇంగ్డ్లాండ్‌ జట్టుకు అవమానమని మాజీ కెప్టెన్ మైఖేల్ వా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా బుధవారం నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టును ఐర్లాండ్ పేసర్ టిమ్ ముర్తా(5/13) గడగడలాడించాడు. లంచ్ విరామానికి ముందే ఆతిథ్య జట్టును 85 పరుగులకు ఆలౌట్ చేసిన ఐర్లాండ్ తొలి రోజు 207 పరుగులకు ఆలౌటైంది. పిచ్ పేసర్లకు అనుకూలించినా, బ్యాట్స్‌మెన్‌ నిలదొక్కుకుని ఆడే పరిస్థితి కూడా ఉండిందని వా వెల్లడించాడు. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు చెత్త షాట్లు కూడా ఆడారని తెలిపాడు. కాగా ఇంగ్లాండ్ 1997లో ఆస్ట్రేలియా చేతిలో 77 పరుగులకే ఆలౌటైంది. 22 ఏళ్ల తర్వాత మళ్లీ తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ జట్టుకు ఇది మూడో టెస్టు మాత్రమే. 2017లో టెస్టు హోదా దక్కించుకున్న ఆ జట్టు పాక్, అఫ్గానిస్థాన్ జట్లతో ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos