కేసీఆర్ మ‌నవడికి తప్ప ఇంట్లో అందరికీ ఉద్యోగాలు

కేసీఆర్ మ‌నవడికి  తప్ప ఇంట్లో అందరికీ ఉద్యోగాలు

హైదరాబాదు: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షుకు తప్ప ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని భాజపా నేత డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేసారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘పరీక్షలో ఫెయిలైన కవితకు కూడా ఇటీవలే ఉద్యోగమిచ్చారు. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చూస్తుంటే మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మనవడు హిమాన్షు ఒక్కడే ఖాళీగా ఉన్నాడ’ని కేసీఆర్పై విరుచుకు పడ్డారు. ‘తండ్రీ, కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు. వర్రీయింగ్ ప్రెసిడెంట్ . మజ్లిస్ తో జట్టుకట్టి హైదరాబాద్ ను నాశనం చేశారు. రాష్ట్రానికి సముద్రం లేదన్న బెంగను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరదల రూపంలో తీర్చింది. హైదరాబాదులో రోడ్లు బాగుపడేంత వరకు ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేద’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos