కేజీఎఫ్‌-2లో నటించాలని ఉందా?

  • In Film
  • April 22, 2019
  • 140 Views
కేజీఎఫ్‌-2లో నటించాలని ఉందా?

గత ఏడాది డిశంబర్‌లో విడుదలైన రాకింగ్‌స్టార్‌ యశ్‌ నటించిన కేజీఎఫ్‌ చిత్రం ఎవరూ ఊహించని విధంగా పాన్‌ ఇండియా లెవెల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.కేజీఎఫ్‌ చిత్రం విడుదల కాకముందు కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన యశ్‌ కేజీఎఫ్‌ అనంతరం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొని నేషనల్‌స్టార్‌గా ఎదిగాడు.కేజీఎఫ్‌ మొదటి భాగం సంచనల విజయం సాధించడంతో మొదటి పార్ట్‌కు కొనసాగింపుగా తెరకెక్కతున్న కేజీఎఫ్‌-2పై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.కాగా కేజీఎఫ్‌-2లో నటించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆడిషనల్‌లో పాల్గొనవచ్చంటూ చిత్ర బృందం ఒక పోస్టర్‌ విడుదల చేసింది.8 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు, 25 సంవత్సరాలు పైబడిన పురుషులు కావాలని ప్రకటన విడుదల చేశారు. అయితే ఆడిషన్ వచ్చే ముందు నిమిషం పాటు ఏదైనా డైలాగ్స్ ని నేర్చుకొని రావాలని సూచించారు.ఈ ఆడిషన్స్ బెంగుళూరులోని జీఎం రిజాయిస్ లో ఏప్రిల్ 26న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు జరగనున్నట్లు వెల్లడించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos