కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

న్యూ ఢిల్లీ: లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రోస్ అవెన్యూ కోర్టు అతడి జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. దీంతో కేజ్రీవాల్ను కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరింది. అంతేకాదు లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని చెప్పింది. తప్పించుకునే సమాధానలు ఇస్తున్నారని వెల్లడించింది. కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వలేదని, తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ చెప్పింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos