కేబినెట్‌లో లేకపోతేనేం ఇంట్లో ఉన్నారుగా..

కేబినెట్‌లో లేకపోతేనేం ఇంట్లో ఉన్నారుగా..

ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటిపై నిరసనలు,ఆగ్రహావేశాలు
వ్యక్తం కాగానే నాలుక కరుచుకొని వెంటనే తన మాటలు వక్రీకరించారని లేదా తప్పుగా అర్థం
చేసుకున్నారని తానసలు అలా అననేలేదని దిద్దుబాటు చర్యలు తీసుకోవడం రాజకీయ నేతలకు తరచూ
ఇదో అలవాటుగా మారింది.రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వీడియోలో ఉన్న తన మాటల్ని వక్రీకరించారని.. తాను దళితుల్ని కించపరిచేలా మాట్లాడానన్న ఆరోపణల్లో నిజం లేదని
ఎప్పటిలానే తప్పును విపక్షాల మీద వేసిన ఆయన.. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.తాజాగా
తెలంగాణలో కూడా అధికార పార్టీకి చెందిన మంత్రి 
జగదీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళాలోకం నిరసనల బాట పట్టింది.ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత 70 రోజులకు ఆయన 10 మంది మంత్రులను నియమించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొత్త మంత్రివర్గంలోనూ ఒక్క మహిళ కూడా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. దీంతో అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇక రెండోసారి సీఎం అయిన తరువాతైనా ఆ లోటు భర్తీచేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మహిళలకు స్థానం కల్పించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న కొత్త మంత్రులను చేర్చుకున్నతరువాత మీడియా వారితో మాట్లాడింది. కేసీఆర్ గత కేబినెట్లో ఉండి మళ్లీ రెండోసారి కూడా స్థానం సంపాదించుకున్న జగదీశ్వర్ రెడ్డిని విలేకరులు ఇదే విషయం అడిగారు. మహిళలకు ఎందుకు అవకాశమివ్వలేదు అని అడిగారు. దానిక ఆయన చెప్పిన సమాధానం విని విలేకరులే కాదు యావత్ తెలంగాణ ప్రజలూ షాకయ్యారు. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నారు కదా..’’ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దీంతో విలేకరులు.. ఇదేంటని ప్రశ్నించగా.. ఆయన కవర్ చేసుకుంటూ.. మహిళలు ఇంట్లో ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అన్నట్లుగా మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలోనూ దుమారం రేగింది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద దీనిపై స్పందిస్తూ… మంత్రి ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. కేసీఆర్ ఎందుకు మహిళలను మంత్రులుగా తీసుకోవడం లేదన్నది మాత్రం యక్షప్రశ్నగానే మిగిలిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos