కేఏ పాల్‌ పాత్రలో సునీల్!

  • In Film
  • June 26, 2019
  • 128 Views
కేఏ పాల్‌ పాత్రలో సునీల్!

కిలారీ ఆనంద్‌ పాల్‌ అలియాస్‌ కేఏ పాల్‌ అంటే తెలియని తెలుగుడో ఉండడంటే అతిశయోక్తి కాదేమో.ఎన్నికల సమయంలో తెగ హడావిడి చేస్తూ ఇంటర్‌వ్యూలలో,యూట్యూబ్‌లో విపరీతంగా కామెడీ పంచే కేఏ పాల్‌ వీడియోలకు వచ్చే వ్యూస్‌ అంతా ఇంతా కాదు.ప్రపంచంలో నాకు తెలియని విషయం ఏదీ లేదని ప్రార్థనలతోనే గుండె జబ్బులను నయం చేస్తానని ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లో నడుస్తుందని  తాను పాతికేళ్ల వాడిలా కనిపిస్తానని, ట్రంప్, బుష్ తో పరిచయాలని ఇలా ఏదోదో మాట్లాడేస్తూంటారు.ఈసారి ఎన్నికల సమయంలో కేఏ పాల్‌ కామెడీ పీక్స్‌ దాటేసింది.175 నియోజకవర్గాల్లోనూ తన పార్టీదే విజయమని నేనే సీఎంనని ఆంధ్రప్రదేశ్‌ను అలా చేస్తా ఇలా చేస్తానంటూ కేఏ పాల్‌ చేసిన కామెడీతో ఎన్నికల సమయంలో ప్రజలకు కొంత రిలీఫ్‌ దొరికింది.దీంతో ఇలాంటి వింత క్యారక్టర్ పై సినిమా వాళ్ల దృష్టి పడింది.ఎన్నికల్లో విచిత్ర వేషాలతో ఓటర్లను ఆకట్టుకున్న కిలారీ ఆనంద్ పాల్ లాగా తెరపై ప్యారెడీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు సునీల్ ని ఎంచుకున్నట్లు సమాచారం.సునీల్ సైతం ఈ పాత్రకు ఉత్సాహంగా ఉన్నారట.అయితే సినిమాలో హీరోగా సునీల్ చేత ఈ పాత్ర చేయిస్తారా లేక ఓ పాత్రగా సునీల్ ఈ గెటప్ లో కనిపిస్తారో చూడాలి. అలాగే బ్రతికి ఉన్న వ్యక్తుల లైవ్ పాత్రలు చేయాలంటే ముందు వారి నుంచి ఫర్మిషన్ తీసుకోవాలి. మరి కేఏ పాల్ ఇస్తాడా లేదో చూడాలి. ఒకవేళ నిజంగానే ఇది కార్యరూపం దాల్చితే కేఏ పాల్‌ పాత్రలో తెరపై సునీల్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో,డైలాగులతో,హావభావాలతో తెరపై నవ్వులు చింపేయడం తథ్యం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos