గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం

విశాఖ పట్టణం : బకాయిల్ని చెల్లించనందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను ఈ నెల 25న హైదరాబాద్ లో వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది. ప్రత్యూష కంపెనీకి చెందిన తొమ్మిది ఆస్తుల్ని వేలం వేస్తారు. గతంలో ప్రత్యూష కంపెనీ రూ.248 కోట్ల మేరకు ఇండియన్ బ్యాంక్లో రుణం తీసుకుంది. 2006 అక్టోబర్ 4న రుణం చెల్లించాలంటూ మొదటి సారి బ్యాంక్ తాఖీదుల్ని జారీ చేసింది. స్పందన లేకపోవడంతో 2017 ఫిబ్రవరి 21న ప్రత్యూష కంపెనీ కుదువ పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాస రావుతో పాటు సంస్థలో భాగస్వాముల ఆస్తులనూ వేలం వేయనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos